ఉదయం 9.15 గంటలకే ఆఫీసుల్లో ఉండాలి.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశాలు

ఉదయం 9.15 గంటలకే ఆఫీసుల్లో ఉండాలి.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశాలు

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ టైమింగ్స్ పాటించాలని ఆదేశాలు ఇచ్చింది. ఉదయం 9 గంటల 15 నిమిషాలకే ఆఫీసుల్లో ఉండాలని.. లేదంటే హాఫ్ డే లీవ్ కింద పరిగణిస్తామని వార్నింగ్ ఇచ్చింది. బయోమెట్రిక్ విధానం కచ్చితంగా ఫాలో అవ్వాలని లేదంటే శాఖాపరమైన చర్యలు ఉంటాయని మాస్ వార్నింగ్ జారీ అయ్యాయి. చెప్పాపెట్టకుండా సెలవులు పెడితే ఊరుకునేది లేదని.. ముందుగానే సెలవు విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని..లేదంటే నోటీసు ఇవ్వాలని ఆదేశించారు ఉన్నతాధికారులు.

ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించాలని ఉదయం 9.15 గంటలకు తప్పకుండా ఆఫీసులో ఉండాలని, బయోమెట్రిక్ విధానం ఉపయోగించి వారి హాజరును గుర్తించాలని స్టాఫ్, ట్రైనింగ్ డిపార్టుమెంట్ ఆదేశాలు జారీచేసింది. సమయపాలన పాటించకపోతే హాఫ్ డే సాలరీ కట్ అవుతుందని హెచ్చరించింది. చెప్పాపెట్టకుండా ఉద్యోగులు సెలవులు పెట్టరాదని, ముందుగా నోటీసు ఇచ్చి సెలవును తీసుకోవాలని సూచింది. 

గతంలో కోవిడ్ కారణంగా చాలా మంది సిబ్బంది బయోమెట్రిక్ హాజరు విధానాన్ని పాటించలేదు. DoPT ఇటీవల ఇచ్చిన సర్క్యూలర్ లో ఈ గైడ్ లైన్స్ ను కీలకం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ టైమింగ్స్ ఉదయం 9 నుంచి 5.30 గంటల వరకు ఉండగా.. ఉద్యోగులు ఆలస్యంగా రావడం, త్వరగా వెళ్లిపోవడం వంటి సమస్యల వల్ల ప్రజావ్యవహారాల డిపార్టుమెంట్లలో ఇబ్బంది కలుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు.

అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దీనిని వ్యతిరేకించారు. ఎలక్ట్రానిక్ ఫైల్స్ ద్వారా వెంటవెంటనే పనులు  జరిగిపోతున్నాయి..రిమోట్ పనిచేస్తున్నందుకు ఎలాంటి ఇబ్బంది లేదు.. షెడ్యూల్ సమయాన్ని దాటి కొంతమంది ఉద్యోగులు ఆఫీసుల్లో పనిచేస్తారని ఉద్యోగులు వాదించారు. అయినప్పటికే ఆలస్యం, ముందు వెళ్లడం వల్ల పరిమాణాలు ఉంటాయని తాజా సర్క్యులర్ లో కేంద్రం హెచ్చరించింది. ఇది ప్రభుత్వ కార్యకలాపాలను పెంచుతుందని అంచనా వేస్తోంది కేంద్ర ప్రభుత్వం .