ఓటీటీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. ఇకనుండి నో అడల్ట్ కంటెంట్

ఓటీటీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. ఇకనుండి నో అడల్ట్ కంటెంట్

కరోనా పుణ్యమా అని ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల వినియోగం బాగా పెరిగిపోయింది. అంతకుముందు సినిమాలంటే కేవలం థియేటర్స్ మాత్రమే ఆప్షన్ గా ఉండేది. కానీ ఇప్పుడు వాటికి ప్రత్యామ్నాయంగా ఓటీటీలు వచ్చేశాయి. గేమ్ షోలు, టాక్ షోలు, వెబ్ సిరీస్ కు ఇలా కొత్త కొత్త కంటెంట్ తో ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ పంచుతున్నాయి. దీంతో ప్రేక్షకులు ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక ఓటీటీ వినియోగంలో ఎక్కువ యూత్ ఉన్నారు. కాబట్టి.. వారి కోసం సెపరేట్ గా బోల్డ్ కంటెంట్ తో కూడుకున్న సిరీస్ లు ప్లాన్ చేసేవి ఓటీటీ ప్లేట్ ఫార్మ్స్. కానీ.. ఇప్పుడు ఓటీటీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది.

అదేంటంటే.. ఇకనుండి ఓటీటీలకు కూడా సెన్సార్ కట్స్ పడనున్నాయి. ఓటీటీ లకు కూడా సెన్సార్ తప్పనిసరి చేస్తూ నిబంధనలు విధించింది. సినిమాలు, వెబ్ సిరీస్‌లో అసభ్యకరమైన సన్నివేశాలు, డైలాగులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సెన్సార్‌ నిబంధనలు విధించింది. మరీ ముఖ్యంగా ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. నెట్ ఫ్లిక్స్ కూడా ఈ సూచనలను అనుసరించడం మొదలుపెట్టింది. కొత్త నోటీసుల ప్రకారం.. సెన్సార్ చేసిన వెర్షన్‌ను మాత్రమే స్ట్రీమింగ్‌ చేస్తోంది. ఈ కొత్త నిర్ణయంతో ఓటీటీ ఆడియన్స్ కాస్త నిరాశచెందుతున్నారు.