కరోనా కట్టడి కోసం 11 బృందాలు

కరోనా కట్టడి కోసం 11 బృందాలు

పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తున్న ఎంపవర్డ్ గ్రూప్స్
టెస్టింగ్ కిట్లు, పీపీఈ కిట్లు తెప్పించడంలో కీలకపాత్ర
శాంపిల్స్ టెస్టింగ్​కు దేశవ్యాప్తంగా ల్యాబ్స్ గుర్తింపు
ఎగ్జిట్ స్ర్టాటజీపైనా కసరత్తు.. ప్రజల నుంచి సలహాలు స్వీకరణ

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 11 ఎంపవర్డ్ గ్రూపులను మార్చి 29న ఏర్పాటు చేసింది. డిజాస్టర్ మేనేజ్​మెంట్ యాక్ట్ కింద నియమించిన ఈ కమిటీల్లో సీనియర్ బ్యూరోక్రాట్లు, టాప్ ఎక్స్​పర్టులు సభ్యులుగా ఉన్నారు. ఈ 11 టీమ్స్​లో మూడింటిని హెల్త్ సిస్టమ్ కోసం కేటాయించారు. కరోనా కట్టడి కోసం ప్లాన్లు రూపొందించేందుకు, వాటిని అవసరాన్ని బట్టి అమలు చేసేందుకు ఈ గ్రూప్స్​కు అధికారం ఇచ్చారు. కావాల్సినన్ని టెస్టింగ్ కిట్లు, పీపీఈ కిట్లు తెప్పించడంలో ఇవి కీలక పాత్ర పోషించాయి. అలాగే శాంపిల్స్​ను టెస్టు చేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ల్యాబ్స్​ను గుర్తించాయి. అన్​లైన్ ట్రైనింగ్ నిర్వహించాయి. మరోవైపు కేసులు భారీగా పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై మెజారిటీ టీమ్స్ పని చేస్తుండగా.. ఒక టీమ్ మాత్రం లాక్​డౌన్ ఎగ్జిట్ స్ర్టాటజీపై పనిచేస్తోంది. ఇంకో టీమ్ ప్రజల నుంచి సలహాలు స్వీకరిస్తోంది. వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయడం, ఎకనామిక్ యాక్టివిటీని రీస్టార్ట్ చేయడం వంటి వాటిపై వ్యూహాలు రూపొందిస్తోంది.
ఎంపవర్డ్ టీమ్స్ ఇవీ..

1. మెడికల్ ఎమర్జెన్సీ మేనేజ్​మెంట్ ప్లాన్
నీతి ఆయోగ్ మెంబర్ డాక్టర్ వీకే పాల్ ఈ కమిటీకి హెడ్. ఇందులో హెల్త్ డిపార్ట్​మెంట్ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్​తోపాటు మరో నలుగురు సభ్యులు ఉన్నారు.

2. హాస్పిటల్స్, ఐసోలేషన్, క్వారంటైన్ ఫెసిలిటీస్, డిసీజ్ సర్వైలెన్స్, టెస్టింగ్
ఈ కమిటీకి ఎన్విరాన్​మెంట్ మినిస్ర్టీ సెక్రెటరీ సీకే మిశ్రా హెడ్. ఇందులో రైల్వే బోర్డ్ చైర్మన్ వినోద్ యాదవ్, ఐసీఎంఆర్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ రమణ్ ఆర్.గంగాఖేడ్కర్​తోపాటు మరో ఆరుగురు ఉన్నారు.

3. అవైలబులిటీ ఆఫ్ ఎసెన్షియల్ మెడికల్ ఎక్విప్​మెంట్
ఈ కమిటీకి డిపార్ట్​మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ సెక్రెటరీ పీడీ వాఘేలా హెడ్​గా ఉన్నారు. ఇందులో డీఆర్​డీవో సెక్రెటరీ జి.సతీశ్​రెడ్డితో పాటు మరో 10 మంది సభ్యులు ఉన్నారు.

4. ఆగ్మెంటింగ్ హ్యూమన్ రిసోర్సెస్, కెపాసిటీ బిల్డింగ్
ఈ కమిటీకి ఎంఎస్ఎంఈ మినిస్ర్టీ సెక్రెటరీ అరుణ్ పాండా హెడ్​గా ఉన్నారు. ఇందులో ఏడుగురు సభ్యులు ఉన్నారు.

5. ఫెసిలిటేటింగ్ సప్లై చైన్, లాజిస్టిక్స్ మేనేజ్​మెంట్ ఫర్ ఎసెన్షియల్స్
తాగునీరు, శానిటేషన్ డిపార్ట్​మెంట్ సెక్రెటరీ పరమేశ్వరన్ అయ్యర్ హెడ్​గా ఉన్నారు. ఇందులో 10 మంది సభ్యులు ఉన్నారు.

6. కోఆర్డినేషన్ విత్ ప్రైవేట్ సెక్టార్, ఎన్జీవోస్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్
నీతి ఆయోగ్ సీఈవో అమిత్ కాంత్ ఈ కమిటీ హెడ్​గా ఉన్నారు. ఇందులో ఏడుగురు సభ్యులు ఉన్నారు.

7. ఎకనమిక్, వెల్ఫేర్ మెజర్స్
ఎకనమిక్ ఎఫైర్స్ డిపార్ట్​మెంట్ సెక్రెటరీ అతున్ చక్రవర్తి ఈ కమిటీకి చైర్మన్​గా ఉన్నారు. ఇందులో ఏడుగురు సభ్యులుగా ఉన్నారు.

8. ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్, పబ్లిక్ అవేర్​నెస్
ఇన్ఫర్మేషన్, బ్రాడ్​కాస్టింగ్ సెక్రెటరీ రవి మిట్టల్ ఈ కమిటీకి చైర్మన్​గా ఉన్నారు. హోం శాఖ జాయింట్ సెక్రెటరీ పుణ్య సలీల శ్రీవాస్తవతోపాటు మరో ఏడుగురు సభ్యులు ఉన్నారు.

9. టెక్నాలజీ, డేటా మేనేజ్​మెంట్
ఎలక్ట్రానిక్స్, ఐటీ మినిస్ర్టీ సెక్రెటరీ అజయ్ సాహ్నే హెడ్​గా ఉన్నారు. ఇందులో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు.

10. పబ్లిక్ గ్రీవియెన్సెస్, సజెషన్స్
హ్యూమన్ రీసోర్స్ డెవలప్​మెంట్ సెక్రటరీ అమిత్ ఖరే ఈ కమిటీకి చైర్మన్​గా ఉన్నారు. ఇందులో మరో ఐదుగురు సభ్యులు ఉన్నారు.

11. స్ర్టాటజిక్ ఇష్యూస్ లింక్​డ్ టు లాక్​డౌన్
హోం శాఖ సెక్రెటరీ అజయ్ కుమార్ భల్లా ఈ కమిటీ హెడ్. ఇందులో మరో ఐదుగురు సభ్యులుగా ఉన్నారు.

For More News..

ర్యాపిడ్ ​టెస్ట్ ​కిట్లపై చైనీస్ కంపెనీల క్లారిటీ

సౌదీలో ఆ శిక్షను రద్దు చేసిన సుప్రీంకోర్టు

కర్నాటకలో ప్లాస్మా థెరపీ షురూ