న్యూఢిల్లీ : బడ్జెట్లో పర్యావరణ మంత్రిత్వ శాఖకు కేంద్ర ప్రభుత్వం రూ.3,265 కోట్లు కేటాయించింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, సెంట్రల్ జూ అథారిటీ, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ వంటి చట్టబద్ధమైన, నియంత్రణ సంస్థలకు రూ.192 కోట్లు కేటాయించారు.
అలాగే, వన్యప్రాణుల ఆవాసాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం రూ.450 కోట్లు కేటాయించింది. అటవీ విస్తీర్ణాన్ని పెంచడం, ఇప్పటికే ఉన్న అటవీ భూమిని రక్షించడం లక్ష్యంగా పనిచేస్తున్న నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియాకు బడ్జెట్ను రూ.160 కోట్ల నుంచి రూ.220 కోట్లకు పెంచారు.