నిరుద్యోగులకు గుడ్ న్యూస్....కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ లో జాబ్స్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్....కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ లో జాబ్స్

కేంద్రప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.  కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో పలు కేటగిరీల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదదల చేసింది.  పదో తరగతి పాసై, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది. ఆసక్తిగల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్‌లో సూచించింది.   ఈ రిక్రూట్‌మెంట్‌లో పేర్కొన్న ఖాళీలు, అర్హతలు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం.. 

ఖాళీలు :

ఫాబ్రికేషన్ అసిస్టెంట్స్ విభాగంలో షీట్ మెటల్ వర్కర్ పోస్టులు-21,
వెల్డర్ పోస్టులు-34
ఔట్‌ఫిట్ అసిస్టెంట్స్ విభాగంలో ఫిట్టర్ – 88,
మెకానిక్ డీజిల్-19,
మెకానిక్ మోటార్ వెహికల్ పోస్టులు-5
ప్లంబర్-21,
పెయింటర్-12,
ఎలక్ట్రిషియన్-42,
ఎలక్ట్రానిక్ మెకానిక్-19,
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్-34,
షిప్‌రైట్ వుడ్ పోస్టులు-5,

,ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జులై  28 వరకు  అధికారిక వెబ్‌సైట్‌ www.cochinshipyard.in లో అప్లికేషన్  పూర్తి చేయాలి.   ఈ ప్రాసెస్ మొత్తం రెండు దశల్లో ఉంటుంది. తొలుత రిజిస్ట్రేషన్ చేసుకున్నాకే అప్లికేషన్‌ సబ్ మిట్  చేయాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.600 కాగా, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, అంగవైకల్యం కలిగిన వారికి ఫీజు మినహాయింపు ఉంది.. అంటే ఫ్రీ గా అప్లై చేసుకోవచ్చు.

సెలక్షన్ ప్రక్రియ..

ఈ ఉద్యోగాలకు రెండు ఫేజ్ లలో పరీక్షలను నిర్వహిస్తారు..ఫేజ్ 1లో ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ నిర్వహిస్తారు. 35 నిమిషాల పాటు ఉండే ఈ ఎగ్జామ్‌లో రెండు సెక్షన్లు ఉంటాయి. జనరల్ సెక్షన్(పార్ట్ A)లో 10 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, ట్రేడ్ రిలేటెడ్ సెక్షన్‌(పార్ట్ B)లో 20 ప్రశ్నలు ఉంటాయి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను పరిశీలించగలరు.