ఓటీటీ సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు.. ఇకనుండి అది తప్పనిసరి

ఓటీటీ సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు.. ఇకనుండి అది తప్పనిసరి

ఓటీటీ సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కంటెంట్ ప్రసారం చేస్తున్న సమయంలో పొగాకు వ్యతిరేక ప్రకటనలు తప్పనిసరి చేస్తూ కొత్త ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఉన్న అన్నీ ఓటీటీ సంస్థలు తమ కంటెంట్ ప్రసారం చేస్తున్న సమయంలో కనీసం 30 సెకన్లు ఉండేలా ఈ ప్రకటన ఉండాలని ఆదేశించింది. ప్రపంచ పొగాకు దినోత్సవం రోజునే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

ఇక కోరోనా తరువాత ప్రేక్షకులు ఓటీటీ కంటెంట్ పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో కేంద్రం ఈ కొత్త నిబంధన తీసుకొచ్చిందని తెలుస్తోంది.  ఇంతకుముందు ఇలాంటి వార్నింగ్స్ థియేటర్స్, టీవీలకు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఓటీటీకి కూడా తప్పనిసరి చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ 30 సెకన్ల ప్రకటన డిస్క్లైమర్ లా ఉండనుందా లేక 30 సెకన్ల యాడ్ లా వేయాలా అనేది క్లారిటీ రాలేదు.