Chat GPT: కేంద్రం కీలక నిర్ణయం.. రైతులకోసం చాట్‌జీపీటీ

Chat GPT: కేంద్రం కీలక నిర్ణయం.. రైతులకోసం చాట్‌జీపీటీ

ప్రస్తుతం ఎక్కడ విన్నా లేటెస్టు టెక్నాలజీ చాట్‌జీపీటీ గురించే చర్చ నడుస్తోంది. ఈ ఏఐని (ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్‌) నిలిపివేయాలని కొందరు, భవిష్యంతా చాట్‌జీపీటీనే అని మరికొందరు అంటున్నారు. ఈ క్రమంలో కేంద్రం చాట్‌జీపీటీని రైతులకోసం వినియోగించాలని భావిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో నడిచే ఈ సాఫ్ట్‌వేర్ రైతుల వాట్సాప్‌కు అనుసంధానం చేసి ఓ చాబోబాట్‌ని సృష్టించాలని కేంద్రం సన్నాహాలు చేస్తోంది. 

ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన రావడంతోపాటు సందేహాలను తీర్చొచ్చని కేంద్రం భావిస్తోంది. దీనికోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ (Meity) చాట్‌జీపీటీపై పనిచేస్తోంది. ది ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ నివేదిక ప్రకారం ఎంఈఐటీవైలో భాషిణి అనే టెక్నాలజీ ఎక్స్‌పర్ట్స్‌ టీం చాట్‌జీపీటీ ఆధారిత వాట్సాప్‌ చాట్‌బాట్‌ను తయారుచేస్తోంది. ఈ చాట్‌బాట్‌ని మొదట 12 భాషల్లో అందుబాటులోకి తెచ్చి తర్వాత మరిన్ని భాషలకు విస్తరించనున్నట్లు  ఎంఈఐటీవై తెలిపింది.