కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ మరింత ఫోకస్

కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ మరింత ఫోకస్

దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మరింత ఫోకస్ పెంచింది. వచ్చే 40 రోజులు భారత్ కు చాలా కీలకమని భావిస్తున్నారు. జనవరిలో కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ ఎక్కువున్న చైనా, హాంకాంగ్, సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, ఇంగ్లండ్ దేశాల నుంచి వచ్చే వారికి RTPCR నెగెటివ్ సర్టిఫికెట్ ఆదేశాలు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

మరోవైపు ఎయిర్ పోర్టుల్లో విదేశాల నుంచి వచ్చే వారికి టెస్టులు చేయడం, ఐసోలేట్ చేయడం వంటి ఏర్పాట్లపైనా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సమీక్షించనుంది. అక్కడ సన్నద్ధతపై మాండవీయ ఫోకస్ పెట్టనున్నారు. ఇప్పటికే చైనా నుంచి వచ్చే వారు 48 గంటల RTPCR రిపోర్ట్ తోనే తమ దగ్గర ల్యాండ్ అవ్వాలని అమెరికా ఇప్పటికే ఆదేశించింది.