టెలిగ్రామ్లో సినిమాలు డౌన్లోడ్ చేస్తున్నారా.. అయితే మీ ఖాతా ఖాళీ!

టెలిగ్రామ్లో సినిమాలు డౌన్లోడ్ చేస్తున్నారా.. అయితే మీ ఖాతా ఖాళీ!

కొత్త సినిమా రిలీజయింది అంటే చాలు చూసేందుకు ఆడియన్స్ ఎగబడుతుంటారు. ఇక అభిమాన హీరో సినిమా అయితే చెప్పనక్కరలేదు. ఆ ఇంట్రెస్ట్ ఇంకాస్త పెరుగుతుంది. అయితే.. ఒకప్పుడు సినిమా అంటే కేవలం థియేటర్స్ మాత్రమే ఉండేవి కానీ.. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ వేస్ చాలానే ఉన్నాయి. వాటిలో ఓటీటీలు ఒకటి. కానీ దానికి డబ్బులు కట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఫ్రీ చూడటం కోసం రకరకాల వెబ్ సైట్స్ చూస్తుంటారు ఆడియన్స్. 

అందులో ఒకటి టెలిగ్రామ్ యాప్. రిలీజైన సినిమాల థియేటర్ ప్రింట్స్, లేదా ఓటీటీలో రిలీజైన కొత్త సినిమాలను టెలిగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఫ్రీగానే కదా అని ఆడియన్స్ కూడా ఈ వేలో సినిమాకు చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఆ,అలాంటి వారికి ఒక బ్యాడ్ న్యూస్. అదేంటంటే టెలిగ్రామ్ లో సినిమాలు చూసేవారి బ్యాంక్ అకౌంట్స్ ఖాళీ అవుతున్నాయి. అవును నిజమే.. ఇదే విషయాన్ని కేంద్ర హోం‌శాఖలో పనిచేస్తున్న సైబర్ దోస్త్ వెల్లడించింది. టెలిగ్రామ్ లో వచ్చే లింక్స్ తో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ను తెలుసుకొని దాని ద్వారా అకౌంట్స్ నుండి డబ్బులు కాజేస్తున్నారట సైబర్ నేరగాళ్లు. ఈ మధ్య ఇలాంటి కేసులు చాలానే వస్తున్నాయట.  కాబట్టి.. ఫ్రీగా సినిమా చూసేయొచ్చు అనే ఆలోచనలు మానుకోండి అంటూ హెచ్చరిస్తున్నారు కేంద్ర హోం‌శాఖ.