
- సెంట్రల్ ఇరిగేషన్ డిజైన్ ఆఫీసర్లు
బాల్కొండ, వెలుగు: గండి పడిన వరద కాలువ ఏరియా ఫీల్డ్ లెవెల్స్ తీసుకుని అంచనాలను సిద్ధం చేయాలని ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆపరేషన్, మెయింటనెన్స్ ఆఫీసర్ శ్రీనివాస్, చీఫ్ ఇంజినీర్,సెంట్రల్ డిజైన్సత్యనారాయణ రెడ్డి ఆదేశించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి మిడ్ మానేరుకు నీటి సరఫరా చేసే వరద కాలువ 16.425 కిలోమీటర్ వద్ద పడ్డ గండిని ఎస్సారెస్పీ ఇరిగేషన్ ఆఫీసర్లతో కలిసి శుక్రవారం పరిశీలించారు.
వెహికల్ ద్వారా కెనాల్ లోకి దిగి అక్కడి నుంచి జేసీబీ సాయంతో గండిపడ్డ ప్రదేశానికి చేరుకున్నారు. అక్విడక్ట్ డౌన్ స్ట్రీమ్ లో కెనాల్ మట్టి కొట్టుకుని పోయిన తీరును పరిశీలించి, మరమ్మతులపై చర్చించారు. యుద్ధప్రాతిపదికన అంచనాలను సిద్ధం చేసి ఈఎన్ సీ ఆఫీస్ కు పంపాలని ఆదేశించారు. అంతకుముందు ఒడ్డుకుకొట్టుకుపోయిన పంటపొలాలు పరిశీలించారు. వీరి వెంట ఎస్సారెస్పీ సీఈ సుధాకర్ రెడ్డి, ఏస్ఈ జగదీశ్, ఈఈ చక్రపాణి, డీఈ గణేశ్, ఏఈ లు రామారావు, వంశీ, విన్యాస్, అక్తరుద్దీన్ ఉన్నారు.