Security Alert: గూగుల్ క్రోమ్ అప్డేట్ చేసుకోండి..లేకుంటే సైబర్ ఎటాకర్లకు చిక్కినట్లే..

Security Alert: గూగుల్ క్రోమ్ అప్డేట్ చేసుకోండి..లేకుంటే  సైబర్ ఎటాకర్లకు చిక్కినట్లే..

గూగుల్ క్రోమ్ వాడుతున్నారా.. పాత వెర్షన్ నే ఇంకా ఉపయగిస్తున్నారా.. అప్ డేట్ చేయలేదా.. అయితే మీరు ఎటాకర్ల చేతికి చిక్కినట్లు అని హెచ్చరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఔట్ డేటెడె గూగుల్ క్రోమ్ వెర్షన్లను వాడే వారు వెంటనే అప్ డేట్ కావాలని లేకుంటే మీ సిస్టమ్ అటాకర్ల చేతికి చిక్కే అవకాశం ఉందని CERT-in హెచ్చరిస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే గూగుల్ క్రోమ్ అప్ డేట్ వెర్షన్ లేకుండా మీ కంప్యూటర్ ప్రమాదంలో పడ్డట్లే అంటున్నారు. పాత క్రోమ్ వెర్షన్ లో భద్రతాలోపాలు ఉన్నాయని CERT-in స్పష్టం చేసింది.

మీ క్రోమ్ వెర్షన్  అప్డేటా కాదా? 

మీరు Mac లేదా Linux లో ఉన్నట్లయితే అది 120.0.6099.199 కి ముందు వెర్షన్లు, Windows  వినయోగదారులు అయితే అది 120.0.6099.199.200 ముందు వెర్షన్లు ఉంటే వెంటనే అప్ డేట్ చేసుకోవాలి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే..మీ సిస్టమ్ సురక్షితంగా ఉండాలంటే.. వెంటనే మీ కంప్యూటర్ లో Crome బ్రౌజర్ ని అప్ డేట్ చేయండి.