రూ.8.25 లక్షల కోట్లకు ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరిగింది: కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్

రూ.8.25 లక్షల కోట్లకు ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరిగింది: కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్

న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రానిక్స్ గూడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారీ  రూ.8.25 లక్షల కోట్లకు పెరిగిందని, 2017–18 లో తయారైన రూ.3.88 లక్షల  విలువైన ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే రెండింతలకు పైగా పెరిగిందని ఎలక్ట్రానిక్స్ మినిస్ట్రీ సహాయ మంత్రి రాజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చంద్రశేఖర్  పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. 2022–23 లో రూ.1,29,703 కోట్ల విలువైన సెమికండక్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దిగుమతి చేసుకున్నామని తెలిపారు. ‘ప్రభుత్వం తెచ్చిన వివిధ ఇన్సెంటివ్స్ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వలన దేశంలో   ఎలక్ట్రానిక్ గూడ్స్ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2022–23 నాటికి రూ.8.25 లక్షల కోట్లకు పెరిగింది’ అని ఆయన వివరించారు.