సెంట్రల్ టీచర్స్‌కు సీటెట్ నోటిఫికేషన్ విడుదల

సెంట్రల్ టీచర్స్‌కు సీటెట్ నోటిఫికేషన్ విడుదల

కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే కేవీఎస్‍, ఎన్‍వీఎస్‍, ఆర్మీ పాఠశాలలు, టిబెటన్‍ స్కూల్స్‌‌లో టీచర్‍ ఉద్యోగాలకు పోటీపడేందుకు వీలు కల్పించే సెంట్రల్‍ టీచర్‍ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్‍) నోటిఫికేషన్​ విడుదలైంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్​ఈ) ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  సీటెట్​ పరీక్ష ప్రతి ఏడాది రెండుసార్లు జరుగుతుంది. తాజాగా డిసెంబర్‌‌-2024 ఏడాదికి సంబంధించిన సీటెట్​ నోటిఫికేషన్​ విడుదలైంది. అప్లికేషన్ ప్రాసెస్​ సెప్టెంబర్‌‌ 17 నుంచి అక్టోబర్‌‌ 16 వరకు కొనసాగనుంది. డిసెంబర్‌‌ 1న పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సీటెట్‍ నోటిఫికేషన్​ వివరాలతో పాటు ప్రిపరేషన్‍ టిప్స్ తెలుసుకుందాం..

పరీక్ష మొత్తం రెండు పేపర్​లు ఉంటుంది. మొదటి పేపర్​ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్​ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్​ స్కోర్ లైఫ్​ లాంగ్​ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్​ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. 

ప్రిపరేషన్‍ టిప్స్

శిశువికాసం & బోధన:  ఈ సబ్జెక్టులో పేపర్‍-I లో 6 నుంచి 11 ఏళ్లు, పేపర్‍-II లో 11 నుంచి 14 ఏళ్ల వయసు గల పిల్లలకు బోధించడం, పిల్లల ఎడ్యుకేషనల్‍ సైకాలజీ ఆఫ్‍ లెర్నింగ్‍ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇందులో సిలబస్‍ మూడు సెక్షన్లుగా ఉంటుంది. కాన్సెప్ట్ ఆఫ్‍ డెవలప్‍మెంట్‍ అండ్ ఇట్స్ రిలేషన్‍ షిప్స్ విత్‍ లెర్నింగ్‍, ప్రిన్సిపుల్స్ ఆఫ్‍ ద డెవలప్‍మెంట్ ఆఫ్‍ చిల్ర్డన్‍, ఇన్‍ఫ్లూయెన్స్ ఆఫ్‍ ద హెరిడిటీ అండ్‍ ఎన్విరాన్‍మెంట్, మల్టి డైమెన్షనల్‍ ఇంటెలిజెన్స్, పియాజే, కోల్‍బర్గ్, వైగాట్‍స్కీ దృక్పథాలు, అభ్యసనంలో వ్యక్తిగత బేధాలు వంటి టాపిక్‍ల నుంచి 15 ప్రశ్నలు వస్తాయి. 

సమ్మిళిత విద్య భావనలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధన, అణగారిన, అల్పాభివృద్ధి నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలకు బోధన వంటి అంశాల నుంచి 5 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. మూడో సెక్షన్ మొత్తం అభ్యసనం, బోధన టాపిక్‍ ఉంటుంది. దీని నుంచి 10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ సబ్జెక్టులో ప్రైమరీ టీచర్‍, ఎలిమెంటరీ టీచర్ రెండింటికి ఒకే విధమైన సిలబస్‍ ఉన్నా ప్రశ్నల కఠినత, సరళిలో తేడా ఉంటుంది.

లాంగ్వేజస్‍ (తెలుగు&ఇంగ్లీష్‍) : లాంగ్వేజస్‍లో దాదాపు ఒకే రకమైన ప్రశ్నలు వస్తాయి. రెండు అన్‍సీన్‍ ప్యాసేజెస్‍ ఉంటాయి. వీటి నుంచి గ్రామర్‍, కాంప్రహెన్సన్‍, వొకాబులరీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యసనం, ప్రిన్సిపుల్స్ ఆఫ్‍ లాంగ్వేజ్‍ టీచింగ్‍, రోల్‍ ఆఫ్‍ లిజనింగ్‍ అండ్‍ స్పీకింగ్‍, లాంగ్వేజ్‍ స్కిల్స్, రీడింగ్‍, లిజనింగ్‍, స్పీకింగ్‍, రైటింగ్‍ వంటి లాంగ్వేజ్ కాంప్రహెన్సన్‍ అండ్‍ ప్రొఫీషియన్సీ అంశాలు, టీచింగ్‍-లెర్నింగ్‍ మెటీరియల్స్, రెమెడియల్‍ టీచింగ్‍ వంటి అంశాలు రెండు భాషల్లో ఒకేలా ఉంటాయి. ప్రైమరీ, ఎలిమెంటరీ టీచర్ల పరీక్షలో లాంగ్వేజ్‍ సబ్జెక్టుల్లో దాదాపు ఒకే సిలబస్‍ ఉంటుంది. ప్రశ్నల సరళి మారుతుంది.

మ్యాథ్స్ :  ప్రైమరీ టీచర్‍ పరీక్షలోని మ్యాథ్స్‌‌ కంటెంట్‍లో జామెట్రీ, షేప్స్, సాలిడ్స్, నంబర్స్, అడిషన్ అండ్‍ సబ్‍ట్రాక్షన్‍, మల్టిప్లికేషన్‍, డివిజన్‍, మెజర్‍మెంట్, వెయిట్‍, టైం, వాల్యూమ్‍, డేటా హ్యాండ్లింగ్‍, ప్యాటర్న్స్, మనీ టాపిక్‍లున్నాయి. వీటికి 15 మార్కులు కాగా పెడగాజికల్‍ ఇష్యూస్‍ కి 15 మార్కుల కేటాయించారు. పెడగాజికల్‍ ఇష్యూస్‍ లో మ్యాథమెటిక్స్, రీజనింగ్‍ స్వభావం, కరిక్యులమ్‍లో గణితం స్థానం, కమ్యూనిటీ మ్యాథమెటిక్స్, ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్, డయాగ్నోస్టిక్​ అండ్‍ రెమెడియల్‍ టీచింగ్‍ వంటి టాపిక్‍లున్నాయి. వీటి నుంచి 15 ప్రశ్నలు వస్తాయి. ఎలిమెంటరీ టీచర్‍ పేపర్లో నంబర్‍  సిస్టం(నోయింగ్‍&ప్లేయింగ్‍ నంబర్స్, వోల్‍ నంబర్స్, నెగెటివ్‍ నంబర్స్, ఫ్రాక్షన్స్), ఆల్‍జీబ్రా(ఆల్‍జీబ్రా పరిచయం, రేషియో అండ్‍ ప్రపోర్షన్‍), జామెట్రీ, మెన్సురేషన్‍, డేటా హ్యాండ్లింగ్‍) వంటి ముఖ్యమైన మూడు టాపిక్‍ల నుంచి ప్రశ్నలు వస్తాయి.

ఎన్విరాన్‍మెంటల్‍ స్టడీస్‍: పేపర్‍-I కంటెంట్‍లో కుటుంబం, స్నేహితులు (సంబంధాలు, పని, ఆటలు, జంతువులు, మొక్కలు), ఆహారం, ఆవాసం, నీరు, రవాణా,  మనం చేసే వస్తువులు, పనులు వంటి టాపిక్‍లున్నాయి. బోధన సమస్యల్లో పర్యావరణ శాస్ర్తం భావన, పరిధి, ప్రాముఖ్యత, పర్యావరణ విద్య, సైన్స్, సోషల్‍ పరిధి, వాటి మధ్య సంబంధం, బోధన మెటీరియల్స్, ఉపకరణాలు, సీసీఈ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

సైన్స్:  సైన్స్ కంటెంట్‍లో ఫుడ్‍ (ఆహార వనరులు, ఆహార సంఘటనం), వస్తువులు (నిత్యజీవితంలో వాడే వస్తువులు), సజీవ ప్రపంచం, కదిలే వస్తువులు, ప్రవాహ విద్యుత్‍, అయస్కాంతం, సహజ వనరులు, సహజ దృగ్విషయం వంటి టాపిక్‍లున్నాయి. వాటి నుంచి 20 ప్రశ్నలుంటాయి. బోధన సంబంధిత విషయాల్లో సైన్స్ స్వభావం, నిర్మాణం, సామాన్య శాస్ర్తం లక్ష్యాలు, ఆశయాలు, సైన్స్ పై అవగాహన, ఆవిష్కరణలు, బోధన ఉపకరణాలు, మూల్యాంకనం (కాగ్నిటివ్‍/సైకోమోటార్‍/అఫెక్టివ్‍) బోధనలో సమస్యలు, రెమెడియల్‍ టీచింగ్‍ వంటి అంశాల నుంచి 10 ప్రశ్నలు వస్తాయి.

సోషల్‍ స్టడీస్‍: ఇందులో కంటెంట్‍కు 40 మార్కులు, పెడగాజికల్‍ ఇష్యూస్‍ కు 20 మార్కులు కేటాయించారు. చరిత్ర నుంచి ప్రాచీన, మధ్యయుగ,, జాతీయోద్యమం, స్వాతంత్ర్యానంతరం భారతదేశం వంటి పాఠ్యాంశాలున్నాయి. జియోగ్రఫీ, సోషల్‍ అండ్‍ పొలిటికల్‍ లైఫ్‍,  భారత రాజ్యాంగం నుంచి ప్రశ్నలు వస్తాయి. పెడగాజికల్‍ ఇష్యూస్‍లో సోషల్‍ సైన్సెస్‍ భావన, స్వభావం, డెవలపింగ్‍ క్రిటికల్‍ థింకింగ్‍, సోషల్‍ స్టడీస్‍ బోధనలో సమస్యలు, ప్రాథమిక, ద్వితీయ వనరులు, ప్రాజెక్టు వర్క్, మూల్యాంకనం అనే అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

నోటిఫికేషన్

అర్హత: ప్రైమరీ టీచర్‌‌: పేపర్‌‌-I (1 నుంచి 5వ తరగతి వరకు): కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్‌‌ మరియు రెండేళ్ల డిప్లొమా ఇన్‌‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‍లో ఉత్తీర్ణత. 

ఎలిమెంటరీ టీచర్‌‌: పేపర్‌‌-II (6 నుంచి 8వ తరగతి వరకు): డిగ్రీ మరియు రెండేళ్ల డిప్లొమా ఇన్‌‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‍లో ఉత్తీర్ణత (రెండో ఏడాది చదువుతున్న వారూ అర్హులే). 

అప్లికేషన్స్​: ఆన్​లైన్​లో అక్టోబర్​ 16 వరకు లో అప్లై చేసుకోవాలి. డిసెంబర్​ 15న పరీక్ష నిర్వహిస్తారు. వివరాలకు www.ctet.nic.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

పేపర్‌‌-1    ప్రశ్నలు    మార్కులు

చైల్డ్
డెవలప్‍మెంట్‍ 
& పెడగాజీ    30    30 
లాంగ్వేజ్​-1    30    30
లాంగ్వేజ్​2    30    30
మ్యాథ్స్​    30    30
ఇన్విరాన్​మెంటల్​ 
స్టడీస్    30    30
మొత్తం    150    150
పేపర్‌‌-2
(గణితం & సైన్స్‌‌)    ప్రశ్నలు    మార్కులు
చైల్డ్
డెవలప్‍మెంట్‍ 
& పెడగాజీ    30    30 
లాంగ్వేజ్​1    30    30
లాంగ్వేజ్​2    30    30
మ్యాథ్స్​    30    30
సైన్స్‌‌    30    30
మొత్తం    150    150
పేపర్‌‌-2
(సోషల్‌‌ స్టడీస్‌‌)    ప్రశ్నలు    మార్కులు
చైల్డ్
డెవలప్‍మెంట్‍ 
& పెడగాజీ    30    30 
లాంగ్వేజ్​-1    30    30
లాంగ్వేజ్​2    30    30
సోషల్‌‌ స్టడీస్‌‌    60    60
మొత్తం    150    150