మిధానిలో భారీగా ఉద్యోగాలు.. జీతం 12 వేలు.. టెన్త్, ఐటిఐ పాసైనోళ్లు అప్లయ్ చేసుకోవచ్చు..

మిధానిలో భారీగా ఉద్యోగాలు.. జీతం 12 వేలు.. టెన్త్, ఐటిఐ పాసైనోళ్లు అప్లయ్ చేసుకోవచ్చు..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ, రక్షణ ఉత్పత్తి శాఖ పరిపాలనా నియంత్రణలోని ప్రభుత్వ రంగ సంస్థ, మినీరత్న కంపెనీ అయిన మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) అప్రెంటీస్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

పోస్టులు: 210. (ఐటీఐ ట్రేడ్ 160, గ్రాడ్యుయేట్ 30, టెక్నీషియన్ డిప్లొమా 29) .

ఐటీ విభాగాలు: ఫిట్టర్ 45, ఎలక్ట్రీషియన్ 30, మెషినిస్ట్ 15, టర్నర్ 15, డిజిల్ మెకానిక్ 03, ఆర్ అండ్ ఏసీ 02, వెల్డర్ 15, సీఓపీఏ 10,  ఫొటోగ్రాఫర్ 01, ప్లంబర్ 02, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్ 03, కెమికల్ లాబొరేటరీ అసిస్టెంట్ 06, డ్రాఫ్ట్స్​మెన్ (సివిల్) 03, కార్పెంటర్ 03, ఫౌండ్రీమెన్ 02, ఫర్నేస్ ఆపరేటర్ (స్టీల్ ఇండస్ట్రీ) 03, పంప్ ఆపరేటర్ కం మెకానిక్ 03. గ్రాడ్యుయేట్ బి.టెక్/ బీఈ (జీఏటీఎస్):  మెటలర్జీ 12, మెకానికల్ 8, ఎలక్ట్రికల్/ ఈఈఈ 5, సివిల్ 3, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఐటీ 02. 

టెక్నీషియన్ డిప్లొమా (టీఏటీఎస్):  మెటలర్జీ 8, మెకానికల్ 7, ఎలక్ట్రికల్/ ఈఈఈ 5.

ఎలిజిబిలిటీ
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. 

టెక్నీషియన్ (డిప్లొమా అప్రెంటీస్): గుర్తింపు పొందిన బోర్డు నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. 

ఐటీఐ ట్రేడ్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 30 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా. జనరల్ మేనేజర్– ఐ/సి ట్రైనింగ్ అండ్ డెవలప్​మెంట్ డిపార్ట్​మెంట్, మిధాని, కంచన్​భాగ్, హైదరాబాద్–500058 చిరునామాకు అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది. 

అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 11.

లాస్ట్ డేట్: డిసెంబర్ 12. 

స్టైఫండ్: అప్రెంటీస్​షిప్స్ ఏడాదిపాటు ఉంటుంది.  ఈ కాలంలో ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్ ట్రైనీలకు ప్రతి నెలా రూ.9600, గ్రాడ్యుయేట్ (జీఏటీఎస్)కు ప్రతి నెలా రూ.12,300, టెక్నీషియన్ (టీఏటీఎస్)కు ప్రతి నెలా  రూ.10,900 చెల్లిస్తారు.

సెలెక్షన్ ప్రాసెస్: పదోతరగతి, ఐటీఐ– ఎన్​సీవీటీలో పొందిన మార్కుల శాతం ఆధారంగా ఉంటుంది. తుది ఎంపిక వయసు, క్వాలిఫకేషన్, కేటగిరీ, ఆధార్ ద్వారా నిర్ణయిస్తారు. 

పూర్తి వివరాలకు midhani-india.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.