
రాష్ట్రం నుంచి బియ్యం సేకరణ నిలిపివేతపై కేంద్రం ప్రకటన చేసింది. అవకతవకలకు పాల్పడుతున్న మిల్లర్లపై టీఆర్ఎస్ సర్కార్ చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించింది. ఇటీవల పలు మిల్లుల్లో నిర్వహించిన తనిఖీల్లో అవకతవకలు గుర్తించినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని చెప్పింది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద ఆహర ధాన్యాలను పంపిణీ చేయలేదని కేంద్రం విమర్శించింది. అవకతవకలకు పాల్పడుతున్న మిల్లర్లపై చర్యలు తీసుకుంటామన్న తెలంగాణ ప్రభుత్వం.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పుకొచ్చింది. అవకతవకలు, ఆహార ధాన్యాల పంపిణీ అధారంగా FCI నిర్ణయం తీసుకుంటుందని కేంద్రం స్పష్టం చేసింది.