ఉల్లి ఎగుమతులకు ఓకే చెప్పిన కేంద్రం

ఉల్లి ఎగుమతులకు ఓకే చెప్పిన కేంద్రం

న్యూఢిల్లీ: ఎగుమతులపై నిషేధం ఉన్నప్పటికీ మహారాష్ట్ర నుంచి  99,500 టన్నుల ఉల్లిపాయలను ఆరు పొరుగు దేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతించినట్లు కేంద్రం శనివారం తెలిపింది.   మిడిల్ ఈస్ట్,  కొన్ని ఐరోపా దేశాలలో ఎగుమతి మార్కెట్లకు 2,000 టన్నుల తెల్ల ఉల్లిపాయలను కూడా అమ్మనుంది. మనదేశం డిసెంబర్ 8, 2023న  ఉల్లిపాయల ఎగుమతిని నిషేధించింది. బంగ్లాదేశ్, యూఏఈ, భూటాన్, బహ్రెయిన్, మారిషస్, శ్రీలంక దేశాలకు 99,150 టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేయడానికి ప్రభుత్వం అనుమతించింది. 

గత సంవత్సరంతో పోలిస్తే 2023–-24లో ఖరీఫ్, రబీ పంటల దిగుబడి తక్కువగా ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో దేశీయంగా తగినంత లభ్యత ఉండేలా చూడటానికి ఎగుమతులపై నిషేధం విధించారు.  నేషనల్ కో–ఆపరేటివ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్స్ లిమిటెడ్ (ఎన్​సీఈఎల్), దేశీయ ఉల్లిపాయలను ఎల్–1 ధరలకు ఈ–-ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్ ద్వారా ఎగుమతి చేయనుంది.  

దిగుమతి చేసుకునే ప్రభుత్వం నామినేట్ చేసిన ఏజెన్సీ లేదా ఏజెన్సీలకు సరఫరా చేస్తుంది.  అంతర్జాతీయ  దేశీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఉన్న ధరలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఆరు దేశాలకు ఎగుమతి చేయడానికి కేటాయించిన కోటా నుంచి గమ్యస్థాన దేశం చేసిన అభ్యర్థన మేరకు సరఫరా చేస్తారు.  వినియోగదారుల వ్యవహారాల శాఖ ధరల స్థిరీకరణ నిధి (పిఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్) కింద రబీ పంటకాలంలో ఈ ఏడాది 5 లక్షల టన్నుల ఉల్లిని సేకరించాలని కేంద్రం నిర్ణయించింది.

 ఉల్లిపాయల నిల్వ నష్టాన్ని తగ్గించడానికి, ముంబైలోని బార్క్​ నుంచి సాంకేతిక మద్దతుతో, గత సంవత్సరం 1,200 టన్నుల రేడియేషన్  కోల్డ్ స్టోరేజీ నిల్వల పరిమాణాన్ని ఈ సంవత్సరం 5,000 టన్నులకు పెంచాలని నిర్ణయించారు. 2023–-24లో (మొదటి ముందస్తు అంచనాలు) ఉల్లి ఉత్పత్తి గత ఏడాది 302.08 లక్షల టన్నులతో పోలిస్తే దాదాపు 254.73 లక్షల టన్నులుగా ఉంటుందని అంచనా. మహారాష్ట్రలో 34.31 లక్షల టన్నులు, కర్ణాటకలో 9.95 లక్షల టన్నులు, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3.54 లక్షల టన్నులు, రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3.12 లక్షల టన్నుల ఉత్పత్తి తగ్గడమే ఇందుకు కారణం.