కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 14 మొబైల్ యాప్స్ పై నిషేధం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 14 మొబైల్ యాప్స్ పై నిషేధం

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 14 మొబైల్ అప్లికేషన్‌లను బ్లాక్ చేసింది.  పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌లుగా వీటిని ఉపయోగిస్తున్నారని కేంద్రం గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. రక్షణ దళాలు, భద్రత, ఇంటెలిజెన్స్, దర్యాప్తు సంస్థల సూచన మేరకు ఈ చర్య తీసుకున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 69A ప్రకారం ఈ యాప్‌లు బ్లాక్ చేయబడ్డాయి.  

కేంద్రం బ్లాక్ చేసిన అప్లికేషన్‌లలో క్రిప్‌వైజర్, ఎనిగ్మా, సేఫ్‌స్విస్, విక్రమ్, మీడియాఫైర్, బ్రియార్ మొదలగు యాప్స్ ఉన్నాయి.  దేశ భద్రతకు ముప్పు తెచ్చే మొబైల్ అప్లికేషన్లపై అణిచివేత కొత్తేమీ కాదు..  గతంలో కేంద్రం ప్రభుత్వం పలు చైనీస్ యాప్‌లను నిషేధించింది.  భారత ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 250 చైనీస్ యాప్‌లపై నిషేధం విధించింది.