వరల్డ్ పీస్ కాన్ఫరెన్స్‌కు వెళ్లేందుకు దీదీకి నో పర్మిషన్

వరల్డ్ పీస్ కాన్ఫరెన్స్‌కు వెళ్లేందుకు దీదీకి నో పర్మిషన్

న్యూఢిల్లీ: వరల్డ్ పీస్ కాన్ఫరెన్స్ కు వెళ్లేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి విదేశాంగ శాఖ అనుమతివ్వలే. అది ఒక ముఖ్యమంత్రి పాల్గొనే ఈవెంట్ కాదని పేర్కొంది. అక్టోబర్​లో ఇటలీలో వరల్డ్ పీస్ కాన్ఫరెన్స్ జరగనుంది. ఇందులో పోప్ ఫ్రాన్సిస్, జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్, ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి పాల్గొననున్నారు. ప్రతినిధులతో రావొద్దన్న ఇటలీ సర్కార్ సూచన నేపథ్యంలో మమత విదేశాంగ శాఖ అనుమతి కోరారు. కేంద్ర నిర్ణయంపై టీఎంసీ ప్రతినిధి భట్టాచార్య మండిపడ్డారు. ‘‘దీదీ రోమ్ ట్రిప్​కు కేంద్రం పర్మిషన్ ఇవ్వలేదు. ఇటలీ వెళ్లడానికి ఎందుకు పర్మిషన్ ఇయ్యలే? మోడీజీ.. బెంగాల్ తో మీకు సమస్యేంటి?” అని ఆయన ట్విట్టర్​లో ప్రశ్నించారు.