
ప్రభుత్వ ఆఫీసులలో వేస్ట్ మెటీరియల్స్ ఎలా కుప్పలుకుప్పలుగా పడతాయో చెప్పనవసరం లేదు. డ్యామేజ్ అయిన కుర్చీలు, టేబుల్స్, ఫ్యాన్స్, కంప్యూటర్స్, ఫైల్స్ తదితర వేస్ట్ మెటీరియల్స్ ను కుప్పలు కుప్పలుగా స్క్రాప్ కింద పారేస్తుంటారు. వాటి కోసం ప్రత్యేక రూమ్ లు, స్థలాన్ని కేటాయిస్తుండటం కారణంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో స్థలం తగ్గుతూ ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. పడేద్దామంటే ప్రభుత్వానికి లెక్క చెప్పాల్సి వస్తుందని తుప్పు పట్టినా.. చెదలు పట్టినా అలాగే భద్రపరుస్తుంటారు.
అయితే ఇలాంటి వేస్ట్ మెటీరియల్స్ ను డిస్పోజ్ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది. ఆఫీస్ వేస్ట్ డిస్పోజల్ ప్రోగ్రాం ద్వారా కేంద్రానికి 3 వేల 300 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. గవర్నమెంట్ ఆఫీస్ లు క్లీన్ చేయడం.. స్క్రాప్ డిస్పోజ్ చేయడమే లక్ష్యంగా 2021 నుంచి కేంద్రం స్క్రాప్, ఆఫీస్ వేస్ట్ డిస్పోజల్ ప్రోగ్రాంను తీసుకొచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల పరిశుభ్రత ప్రచారంలో భాగంగా తెచ్చిన ఈ క్యాంపెయిన్ కు మంచి స్పందన వచ్చినట్లు మంత్రి తెలిపారు.
కార్యాలయాల స్వచ్ఛతా ప్రోగ్రాంలో భాగంగా ఫిఫ్త్ ఎడిషన్ క్యాంపెయన్ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ తీసుకొస్తు్న్నట్లు సందర్భంగా తెలిపారు. గవర్నమెంటు ఆఫీసులు శుభ్రతతో పాటు అనవసర స్క్రాప్ డిస్పోజల్ 5వ విడత ప్రచారాన్ని కేంద్ర మంత్రి మంగళవారం (సెప్టెంబర్ 16) ప్రారంభించారు.
12 లక్షల స్థలాలు.. 1.38 కోట్ల ఫైల్స్ :
ఐదేళ్లుగా నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాం ద్వారా రూ.3,296.71 కోట్ల ఆదాయంతో పాటు 696.27 లక్షల స్కేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ ను పొందినట్లు తెలిపారు. మొత్తం 12.04 సైట్లలో పరిశుభ్రత చేపట్టినట్లు చెప్పారు. అంతే కాకుండా కోటీ 37 లక్షల 86 వేల ఫైల్స్ క్లోజ్ చేసినట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. దీని వలన ఆర్థిక, పరిపాలన సామర్థ్యాన్ని పెంచినట్లు చెప్పారు.
స్పేషియల్ క్యాంపెయిన్ 5.0 రెండు దశలలో జరుగుతుందని తెలిపారు. సెప్టెంబర్ 16 నుంచి 30 వరకు ప్రిపరేషన్ స్టేజ్... అక్టోబర్ 02 నుంచి 31 వరకు ఇంప్లిమెంటేషన్ స్టేజ్ ఉంటుందని చెప్పారు. నవంబర్ 15 నుంచి 30 వరకు థర్డ్ పార్టీ ద్వారా క్లీనింగ్ ప్రోగ్రాం నడుస్తుందని తెలిపారు. ఈవేస్ (ఎలక్ర్టానిక్ వేస్ట్), పెండింగ్ ఫైల్స్ మొదలైన అంశాలపై ఫోకస్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు మంత్రి జింతేంద్ర సింగ్.