15 ఏండ్లు దాటిన బండ్లకు గ్రీన్ ట్యాక్స్ ?

15 ఏండ్లు దాటిన బండ్లకు గ్రీన్ ట్యాక్స్ ?
  • రాష్ట్రాలకు గ్రీన్ ట్యాక్స్ ప్రపోజల్
  • తెలుగు రాష్ట్రాలో తిరుగుతున్న వాహనాల రికార్డుల్లేవు

న్యూఢిల్లీ: దేశంలో 15 ఏళ్ల లైఫ్ సర్వీస్ దాటి.. ఇంకా రోడ్లపై నడుస్తున్న వెహికల్స్ సుమారు నాలుగు కోట్ల పైనే ఉన్నాయని కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఒక్క కర్నాటక రాష్ట్రంలోనే ఇలాంటి వాహనాలు 70 లక్షలకు పైగానే ఉన్నాయని తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, లక్షద్వీప్ రాష్ట్రాల నుంచి అధికారిక రికార్డులేవీ లేకపోవడంతో ఈ రాష్ట్రాల డేటాను కేంద్రం కలుపలేదు. ఇలా 15 ఏళ్లు దాటిన వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ విధించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది.