
షాద్ నగర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 28 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అమృత్ పథకం కింద రూ.28 కోట్ల విడుదల చేసినట్లు ఎంపీ డీకే అరుణ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని మిషన్ భగీరథ పనులను పూర్తి చేయడానికి ఈ నిధులను వెచ్చిస్తారు.
నిధుల విడుదలతో మిషన్ భగీరథ పనులను మహబూబ్ నగరర్ ఎంపీ డీకే అరుణ, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా డీకే అరుణ అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తుందని తెలిపారు.
ALSO READ | సమస్య తీరాలంటే స్వయం సేవే దిక్కు.. గుర్రపు డెక్కను స్వయంగా తొలగించుకుంటున్న మత్స్యకారులు