- ఇరు రాష్ట్రాలకు కలిపి రూ.3,448 కోట్లు
న్యూఢిల్లీ, వెలుగు : వరదలతో అతలాకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాలకు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ (ఎస్టీఆర్ఎఫ్) కింద సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్చౌహాన్ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రాల వద్ద ఉన్న రూ. 3,448 కోట్లను ఇందుకు వినియోగించుకోవాలని, ఇందులో కేంద్రం వాటా కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని మోదీ ఆదేశాలతో శుక్రవారం ఏపీ, తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించానని, ఈ సందర్భంగా భారీ వర్షాలతో నష్టపోయిన రైతులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నానని చెప్పారు. బాధిత రైతులకు కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటుందని మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భరోసా ఇచ్చారు.