సన్‌రైజర్స్ స్పాన్సర్​గా సెంచరీ మ్యాట్రెస్‌ 

సన్‌రైజర్స్ స్పాన్సర్​గా సెంచరీ మ్యాట్రెస్‌ 

హైదరాబాద్, వెలుగు: సన్‌రైజర్స్ హైదరాబాద్​కు స్పాన్సర్​గా వ్యవహరిస్తున్నట్టు సెంచరీ మ్యాట్రెస్ ప్రకటించింది. భారత టీ20 క్రికెట్ లీగ్‌లోని పాపులర్​ ఫ్రాంచైజీలలో ఒకదానికి  మద్దతును అందించడం తమ బ్రాండ్‌కు ఒక ముఖ్యమైన మైలురాయి అవుతుందని పేర్కొంది.ఆటలకు మద్దతు ఇవ్వడానికి  దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఔత్సాహికులతో కనెక్ట్ అవ్వడానికి సెంచరీ కట్టుబడి ఉందని పేర్కొంది.

తమకు ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ ప్రాంతాలలో భారీ మార్కెట్ వాటా ఉందని  సెంచరీ మ్యాట్రెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్తమ్ మలానీ చెప్పారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఈ  ప్రయాణాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.