సీఈవోను చెంపదెబ్బ కొట్టే జాబ్.. గంటకు 6 వందల జీతం

సీఈవోను చెంపదెబ్బ కొట్టే జాబ్.. గంటకు 6 వందల జీతం

ఈ రోజుల్లో ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అకౌంట్ ఉండని వారు ఉండరంటే ఆశ్చర్యపోనవసరం లేదు. డిజిటల్ యుగంలో ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అయ్యేందుకు, తమ భావాలను పంచుకునేందుకు వేదికలైన ఈ మాధ్యమాలపై చాలా మంది గంటల కొద్దీ సమయం వెచ్చిస్తుంటారు. టైమ్ దొరికితే చాలు వాట్సాప్, ఎఫ్‌బీ ఓపెన్ చేసిన అప్‌డేట్స్ చూసుకోవడం దాదాపుగా అందరికీ అలవాటు అయిపోయింది. ఈ నేపథ్యంలో ఎఫ్‌బీలో గడిపే సమయాన్ని తగ్గించేందుకు ఓ కంపెనీ సీఈవో చేసిన పని గురించి వింటే నవ్వుకోకమానరు. ఏకంగా ఓ ఉద్యోగిని నియమించుకున్న పాల్వొక్ సంస్థ సీఈవో.. ఫేస్‌బుక్ ఓపెన్ చేసినప్పుడల్లా తనను కొట్టమని ఆమెకు సూచనలు ఇచ్చాడు.

ఫేస్‌బుక్ చూడకుండా నియంత్రించేందుకు నియమించుకున్న మహిళా ఉద్యోగికి గంటకు 8 డాలర్ల (భారత కరెన్సీలో సుమారుగా రూ.595)ను ఆ సీఈవో చెల్లిస్తుండటం గమనార్హం. సదరు సీఈవో పేరు మనీశ్ సేథి. ఇలా చేయడం వల్ల తనకు చాలా సమయం మిగులుతోందని.. 98 శాతం సమయాన్ని ప్రభావవంతంగా వినియోగించుకుంటున్నానని భారత సంతతికి చెందిన సేథి చెప్పారు. ఈ విషయం కాస్తా వైరల్ అవ్వడంతో దీనిపై ప్రముఖ బిలియనీర్, టెస్లా కార్ల సంస్థ అధినేత ఎలన్ మస్క్ స్పందించారు. మనీశ్‌కు సంబంధించిన వార్తపై రెండు ఫైర్ ఎమోజీలను మస్క్ కామెంట్‌గా పెట్టారు. దీనిపై మనీశ్ హర్షం వ్యక్తం చేశారు. మస్క్ పోస్టు చేసిన ఫైర్ (మంట) గుర్తులకు అర్థం ఏంటనేది కాలమే నిర్ణయిస్తుందని మనీశ్ ట్వీట్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం: 

వరుసగా మూడోసారి.. పరేడ్‌ను లీడ్‌ చేసిన మహిళా కమాండర్‌‌

ఫొటో ఫ్రేమ్​లలో డ్రగ్స్.. హైదరాబాద్‌ టూ ఆస్ట్రేలియా స్మగ్లింగ్!

మరో 4 వేల కోట్ల కొత్త అప్పుకు రెడీ అయిన సర్కారు