
రెజ్యూమ్ అనేది జాబ్ (Job) పొందడానికి డోర్స్ ఓపెన్ చేసే ఒక తాళం లాంటిది. ఇదే బాగోలేకపోతే జాబ్ హైరింగ్ (Hiring) ప్రాసెస్‌లో మొదటి మెట్టు వద్దే వెనక్కి తిరగాల్సి వస్తుంది. హైరింగ్ మేనేజర్లకు స్కిల్స్, ఎక్స్‌పీరియన్స్, అచీవ్‌మెంట్స్ స్పష్టంగా తెలియజేయడానికి రెజ్యూమ్ ఒక చక్కని అవకాశాన్ని అందిస్తుంది. దీనిని సద్వినియోగం చేసుకొని అందరికంటే భిన్నంగా నిలవాల్సిన బాధ్యత అభ్యర్థులపై ఉంటుంది. కాని న్యూయార్క్‌కు చెందిన 'వాల్‌నట్' అనే హెల్త్‌కేర్ కంపెనీకి వచ్చిన ఓ రెజ్యూమ్ చూసి ఆ కంపెనీ CEO షాక్ తిన్నాడు. ఇంతకు ఆ సీవీలో ఏముందో తెలుసుకుందాం. ...
ట్విట్టర్ యూజర్ రోషన్ పటేల్ (@roshanpatel) న్యూయార్క్‌కు చెందిన 'వాల్‌నట్' అనే హెల్త్‌కేర్ కంపెనీలో ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. ఆ రెజ్యూమ్ చూసిన CEO ఒక్కసారిగా షాక్ తిన్నాడు. రోషన్ అప్లై చేసిన సీవీలో ఆయన స్మెర్మ్ కౌంట్ ను కూడా రాశాడు. అందులో అలాంటి విషయం చదివి షాక్ అయ్యాడు. రోషన్ అతని వృత్తి పరమైన విషయాలు కాకుండా.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు పొందుపరచడంతో .. ఆ సీవీని చదివిన సీఈవో సిగ్గుపడి తన ముఖాన్ని దాచుకున్నానని తెలిపాడు.
CVలో వింత సమాచారం ..
రోషన్ వాల్ నట్ కంపెనీకి ఉద్యోగం అప్లై చేసిన దరఖాస్తులో వింత సమాచారాన్ని పొందుపరిచాడు. అతను తన సగటు స్మెర్మ్ కౌంట్ 800 మిలియన్ కౌంట్ అని రాశాడు. ఆ రెజ్యూమ్ ఇంటర్వ్యూ చేసే 11 మంది బృందం చూశారు. వాస్తవంగా సీవీలో ఆవిషయాన్ని పొందుపర్చాల్సిన అవసరం లేదు.
just got this resume ??? pic.twitter.com/iVQFScQzoF
— Roshan Patel (@roshanpateI) October 30, 2023
సోషల్ మీడియాలో వైరల్
ఈ విషయం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఈ పోస్ట్ ను 23 లక్షల మందికి పైగా చూశారు. నెటిజన్లు తమ అభిప్రాయాన్ని కామెంట్ చేశారు. మనిషికి ఇది చాలా ముఖ్యమైనదని ఒకరు చమత్కారంగా పోస్ట్ చేయగా.. మరొకరు చట్ట ప్రకారం CV పైభాగంలో స్పెర్మ్ కౌంట్‌ను పేర్కొనాలని రాశారు. CVలో ఎలాంటి ఉద్యోగం కావాలో రాయాలని కొంతమంది కామెంట్ చేశారు. అయితే కంపెనీలు అభ్యర్థుల బ్లడ్ గ్రూప్, ప్లేట్‌లెట్ కౌంట్‌కు సంబంధించిన వివరాలు తీసుకుంటారని.. ఈ విషయాలు భవిష్యత్తులో అవసరం కావచ్చని కొంతమంది రాసుకొచ్చారు. ఏది ఏమైనా CVలో స్పెర్మ్ కౌంట్ కు సంబంధించినది రాయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.