నోడల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు డ్యూటీ సరిగ్గా చేయాలి: సీహెచ్‌‌‌‌‌‌‌‌.శివలింగయ్య

నోడల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు డ్యూటీ సరిగ్గా చేయాలి: సీహెచ్‌‌‌‌‌‌‌‌.శివలింగయ్య

జనగామ అర్బన్, వెలుగు : ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ నోడల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు పకడ్బందీగా విధులు నిర్వహించాలని జనగామ కలెక్టర్ సీహెచ్‌‌‌‌‌‌‌‌.శివలింగయ్య ఆదేశించారు. అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ సుహాసినితో కలిసి శనివారం స్థానిక క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో టెలికాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ ప్రత్యేక నోడల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లకు కేటాయించిన పనులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాలని, ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌లో తనిఖీలు చేసి రోజువారీ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ పంపాలని సూచించారు. జిల్లా ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌‌‌‌‌‌‌‌రూంలో నిత్యం సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఎలక్షన్లకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే సంప్రదించాలని సూచించారు.