యాసంగి సీఎంఆర్‌‌‌‌ టార్గెట్‌‌‌‌ను పూర్తి చేయాలి : సీహెచ్‌‌‌‌ శివలింగయ్య

యాసంగి సీఎంఆర్‌‌‌‌ టార్గెట్‌‌‌‌ను పూర్తి చేయాలి : సీహెచ్‌‌‌‌ శివలింగయ్య

జనగామ అర్బన్, వెలుగు : యాసంగి సీఎంఆర్‌‌‌‌ టార్గెట్‌‌‌‌ను వెంటనే పూర్తి చేయాలని జనగామ కలెక్టర్​సీహెచ్‌‌‌‌.శివలింగయ్య ఆదేశించారు. రైస్‌‌‌‌ మిల్లర్లు, అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ రోహిత్‌‌‌‌ సింగ్‌‌‌‌తో కలిసి బుధవారం కలెక్టరేట్‌‌‌‌లో నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు. 2022–23 యాసంగికి సంబంధించి 1,43,351.360 టన్నులు ఇవ్వాల్సి  ఉండగా, ఇప్పటివరకు 60 శాతం మాత్రమే ఇచ్చారన్నారు.

మిగిలిన 41,097 టన్నులను కూడా త్వరగా అందజేయాలని ఆదేశించారు. మిల్లర్లు వారికి కేటాయించిన లక్ష్యాన్ని ఏ రోజు ఆ రోజే పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో డీసీఎస్‌‌‌‌వో రోజారాణి, సివిల్‌‌‌‌ సప్లై డీఎం ప్రసాద్, డీటీ శ్రీనివాస్, వెంకన్న, జయహరి, పి.దిలీప్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.