- తన ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకం అందజేత
న్యూఢిల్లీ, వెలుగు: మహారాష్ట్ర మాజీ గవర్నర్, సీనియర్ నేత సీహెచ్. విద్యాసాగర్ రావు బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్లమెంట్ భవనంలోని కేంద్ర మంత్రి చాంబర్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు తన స్వీయ చరిత్ర ఆధారంగా రచించిన ‘ఉనిక – చెన్నమనేని స్వీయ చరిత్ర’ పుస్తకాన్ని అమిత్ షాకు అందజేశారు.
పుస్తకంలోని కీలక ఘట్టాలు, చారిత్రక అంశాలను అమిత్ షా ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. పుస్తక విశేషాలతో పాటు, దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై నేతలిద్దరూ కాసేపు చర్చించుకున్నారు. ఈ మీటింగ్ అనంతరం విద్యాసాగర్ రావు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.
