సాయుధ పోరాటంపై బీజేపీ కుట్రలు: చాడ వెంకట్రెడ్డి

సాయుధ పోరాటంపై బీజేపీ కుట్రలు: చాడ వెంకట్రెడ్డి
  • రైతాంగ పోరాటాన్ని హిందూ, ముస్లిం గొడవగా చూపే యత్నం:చాడ వెంకట్​రెడ్డి
  • గత పదేండ్లు చరిత్రను వక్రీకరించే కుట్ర చేశారు: శ్రీనివాస్ రెడ్డి
  • ట్యాంక్ బండ్ పై తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఫొటో ఎగ్జిబిషన్

హైదరాబాద్, వెలుగు: భూమి కోసం, భుక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ, ముస్లిం గొడవగా చూపేందుకు  బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాల ని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్​లో తెలంగాణ సాయుధ పోరాట యోధుల స్మృతి వనం, స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 

మంగళవారం హైదరాబాద్​ సిటీలోని ట్యాంక్ బండ్​పై సీపీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం, భూస్వాముల, పెత్తందారులు, దొరల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగిం దని పేర్కొన్నారు. భూస్వాముల కుటుంబంలో జన్మించి న రావి నారాయణ రెడ్డి సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించారని కొనియాడారు. 

ఈ పోరాటాని కి బీజేపీ మతం రంగు పులిమే కుట్రలు చేస్తుందని, హిం దూ, ముస్లిం గొడవలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తారని, అదేవిధంగా తెలంగాణలోనూ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. 

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన పదేండ్ల కాలంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కనుమరుగు చేసేందుకు కుట్ర చేశారని విమర్శించారు. 

పాఠ్యపుస్తకాలలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర ఎక్కడా కనిపించదని, రావి నారాయణ రెడ్డి పేరు లేదని ప్రశ్నిస్తే అప్పుడు ఆయన పేరును పొందుపర్చారన్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్​మాట్లాడుతూ పోరాట ఫలితంగానే పేదలకు 10 లక్షల భూమి పంపిణీ జరిగిందన్నారు. 

నిజాములకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 4 లక్షల మంది యోధులు అమరులయ్యారని, వారి పోరాట ఫలితంగానే దొరలు గడీలను వదిలి పారిపోయారన్నారు. కార్యక్రమంలో వీఎస్.బోస్, నరసింహ, పాశం యాదగిరి, వినాయక్ రెడ్డి, మోటూరి కృష్ణ ప్రసాద్, పల్లె నర్సింహా తదితరులు పాల్గొన్నారు.