హైదరాబాద్, వెలుగు: టూరిజం శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని టూరిజం డిపార్ట్మెంట్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.
టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరి క్రాంతి, ఈడీ ఉపేందర్ రెడ్డి, జీఎం మానవి జగన్ను చాడ వెంకటరెడ్డి నేతృత్వంలో యూనియన్ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని గతంలోనే సంస్థ యాజమాన్యాన్ని కోరామని, ఇప్పటికీ అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
