
- రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు
- మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్
పాలమూరు, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అండర్-23 పురుషుల ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్‌లో క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడారు.
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. కొత్వాల్ బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఉపాధ్యక్షులు సురేశ్ కుమార్, కోచ్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.