- సింగరేణి సీఎండీ బలరాం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి వ్యాప్తంగా 13.30లక్షల మొక్కలను నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామని కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాం తెలిపారు. శుక్రవారం కొత్తగూడెంలోని సింగరేణి బంగ్లోస్ ఏరియాలో ఆయన మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి వ్యాప్తంగా 664 హెక్టార్లలో మొక్కలు నాటుతున్నామన్నారు. ఓపెన్‌కాస్ట్ డంప్ యార్డులు, మైన్స్ పరిసరాలతో పాటు కార్మిక వాడల్లో మొక్కలు నాటుతున్నామని చెప్పారు.
ఇప్పటి వరకు తాను స్వయంగా 40 ఎకరాల్లో 18,291 మొక్కలు నాటినట్లుగా తెలిపారు. ఈ ప్రోగ్రాంలో జీఎం జి. వెంకటరమణ, ఏజీఎం వివేక్ బాబు, డీజీఎంలు హరినారాయణ, రాజీవ్ కుమార్, మేనేజర్ డేవిడ్ అభిలాష్ పాల్గొన్నారు.
================================================================