సీఎం సభ నుంచి మధ్యలోనే వెనుదిరిగిన జనం

సీఎం సభ నుంచి మధ్యలోనే వెనుదిరిగిన జనం

వికారాబాద్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు వచ్చిన జనాలు మధ్యలోనే ఇంటి దారి పట్టారు. కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం అనంతరం సీఎం మాట్లాడుతుండగానే జనాలు వెనుదిరగడంతో సగం కుర్చీలు ఖాళీ అయిపోయాయి. గత ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన హామీల గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతారని అంతా భావించారు. అయితే సీఎం మాత్రం అదే పాత పద్దతిలో ఉపన్యాసం కొనసాగించడంతో జనం విసుగుచెందారు. జిల్లాకు ఎలాంటి ప్యాకేజీలు ప్రకటించకపోవడంతో జనం సభ మధ్యలోనే నిరాశతో వెనుదిరిగారు. 

ఇదిలా ఉంటే సభకు జనాలను తరలించేందుకు వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ నాయకులు నానా కష్టాలు పడ్డారు. మరోవైపు సభ ప్రారంభానికి ముందు, తర్వాత మద్యం ఏరులై పారింది. కలెక్టరేట్ భవనం ఆవరణలోనే మందు సీసాలు కనిపించాయి. ఇక సభకు వెళ్లే దారిలోని ప్రధాన పట్టణాల్లో ఏ వైన్ షాపు దగ్గర చూసినా టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్న జనాలే కనిపించారు. కొన్ని చోట్ల జనాలు బహిరంగంగానే మద్యం తాగుతూ కనిపించారు.