తిరుమల వచ్చిన చైతన్య.. మరి నిహారిక ఎక్కడ?

తిరుమల వచ్చిన చైతన్య.. మరి నిహారిక ఎక్కడ?

మెగా డాటర్ నిహారిక కొణిదెల తన భర్త చైతన్యతో విడాకులు తీసుకుందని, ప్రస్తుతం వారు వేరు వేరుగా ఉంటున్నారనే వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి రీసెంట్ గా నిహారికను అడగగా.. సమాదానం చెప్పకుండా దాటివేసింది. దీంతో విడాకుల రూమర్స్ కు మరింత బలం చేకూరింది. 

ఇక తాజాగా నిహారిక భర్త చైతన్య తన కుటుంబంతో తిరుమలకు వచ్చాడు. అందులో నిహారిక లేకపోవడం గమనార్హం. నిహారిక లేకుండానే చైతన్య ఒక్కడే తన ఫ్యామిలితో కలిసి తిరుమలకు వచ్చాడు. దీంతో మరోసారి డైవర్స్ రూమర్స్ ఊపందుకున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నిహారిక లేకుండా చైతన్య తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. 

అంతే కాకుండా ఈ మధ్య నిహారి ,-చైతన్య జంటగా ఎక్కడా కనిపించకపోవడంలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వీరిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం.. పెళ్లి ఫొటోలు డిలీట్ చేయడం చూస్తుంటే.. వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే ఇలా దూరంగా ఉంటున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.