
జబర్ధస్త్ నటుడు చలాకి చంటి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా కోదాడ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో చంటికి గాయాలయ్యాయి. చంటి ప్రయాణిస్తున్న కారు .. కొమరబండ దగ్గర లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే చంటిని కోదాడ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేశారు. తర్వాత హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని అంటున్నారు డాక్టర్లు.
కొద్ది రోజులుగా టాలీవుడ్ హీరోలు గాయాల బారిన పడడం తెలుగు సినీ అభిమానులని ఎంతగానో కలవరపరుస్తుంది. వరుణ్ తేజ్, నాగశౌర్య, శర్వానంద్, సందీప్ కిషన్ కొద్ది రోజుల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు గాయపడ్డారు.