
- రేవంత్‌కు కేటీఆర్ చాలెంజ్ చేస్తే కేసీఆర్ పనేంటి?
.హైదరాబాద్, వెలుగు: శాసనసభలో చర్చించే అంశాలను బయట చర్చిద్దామంటే అసెంబ్లీ ఎందుకని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ను కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రశ్నించారు. శనివారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలెంజ్ చేయడం ఏందన్నారు. సీఎం రేవంత్ చాలెంజ్ ను ప్రతిపక్ష నేత కేసీఆర్ స్వీకరించాలని సవాల్ విసిరారు. అలాకాకుండా కేటీఆర్, హరీశ్ రావు ముందుకు వస్తే ప్రతిపక్ష నేత ఎందుకన్నారు.
సెకండ్ బెంచ్ వాళ్లు (కేటీఆర్, హరీశ్ రావు) రేవంత్ చాలెంజ్‌కు రెడీ అనడం కరెక్టు కాదన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు సభకు కేసీఆర్ వస్తానంటే అసెంబ్లీ సమావేశాలు పెడతానని రేవంత్ ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు. కానీ, కేటీఆర్ మాత్రం ప్రెస్ క్లబ్ కు రా, బోట్స్ క్లబ్ కు రా అని సవాల్ విసురుతున్నారని, మరో రెండు రోజులైతే కల్లు దుకాణాల వద్దకు రావాలంటారేమో అని ఎద్దేవా చేశారు.