సభను సక్సెస్ చేసిన పార్టీ క్యాడర్ కు థ్యాంక్స్ : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

సభను సక్సెస్  చేసిన పార్టీ క్యాడర్ కు థ్యాంక్స్ : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • పీసీసీ చీఫ్ ​మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సభను విజయవంతం చేసిన పార్టీ కార్యకర్తలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కృతజ్ఞతలు చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సభ కోసం ఎంతో శ్రమించారని, వారి  కష్ట ఫలితమే ఈ సభ సక్సెస్ అని అందులో పేర్కొన్నారు. 

ఈ సభకు చీఫ్ గెస్టులుగా వచ్చిన పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సభతో సామాజిక న్యాయం అనే నినాదం జనంలోకి బలంగా వెళ్లిందని, ఇది కాంగ్రెస్ తోనే సాధ్యమనే విషయం జనంకు ఈ సభతో తెలిసిపోయిందన్నారు.