ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లబ్ ఎందుకు? అసెంబ్లీకి రండి : మంత్రి పొన్నం

 ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లబ్ ఎందుకు? అసెంబ్లీకి రండి : మంత్రి పొన్నం
  • బనకచర్ల, సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధం
  • కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లేఖ రాయిస్తే అసెంబ్లీ పెడదాం
  • కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంత్రి పొన్నం సవాల్  

హైదరాబాద్, వెలుగు: బనకచర్ల ఇష్యూ, సంక్షేమ పథకాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ‘‘చర్చ ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎందుకు? అసెంబ్లీకి రండి. స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రతిపక్ష నేత కేసీఆర్​లేఖ రాస్తే.. శాసన సభ వేదికగా చర్చకు మేం సిద్ధం” అని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సవాల్​విసిరారు. శనివారం ప్రజాభవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో పొన్నం మాట్లాడారు. బహిరంగ చర్చ కోసం ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పిలవడమేంటి? అని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రశ్నించారు. ‘‘తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పాలనుకుంటే దేవాలయం వంటి శాసనసభ వేదికగా చర్చకు రావాలి. 

ఎమ్మెల్యే చర్చించాల్సింది శాసనసభలో.. ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాదు. ప్రభుత్వానికి సంబంధించి ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లబ్ వాళ్లే మాతో, మీతో చర్చిస్తామంటే కచ్చితంగా వస్తాం. కానీ మీరు బహిరంగ చర్చకు అక్కడికి పిలవడం సరికాదు. శాసన సభలో చర్చ చేద్దాం.. అది ప్రజలు లైవ్ చూస్తారు” అని అన్నారు. ఎమ్మెల్యే అయిన కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎక్కడ చర్చ చేయాలో తెలియదా? అని ప్రశ్నించారు.  

అన్యాయం చేసిందే మీరు.. 

తాము చర్చకు వెనుకడుగు వేసే వాళ్లం కాదని పొన్నం అన్నారు. ‘‘మీరే తెలంగాణకు నష్టం జరిగేలా నిర్ణయాలు తీసుకున్నారు. నాడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కలిసి మీరు తీసుకున్న నిర్ణయాలు ఓపెన్ సీక్రెట్. ఆయనకు రెడ్ కార్పెట్ వేసి నీళ్లు దోచిపెట్టిందే మీరు. రాయలసీమను రత్నాల సీమ చేస్తామని చెప్పిందే మీరు” అని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మండిపడ్డారు. ఇక్కడి నీళ్లు అక్కడికి ఇస్తామని చెప్పడానికి మీరెవరని ప్రశ్నించారు.

తెలంగాణ రైతుల హక్కులు కాపాడే బాధ్యత మాది. తెలంగాణ బిడ్డలం ఎవరికీ వ్యతిరేకం కాదు.. తెలంగాణకు అన్యాయం జరిగితే ఎవరితో కాంప్రమైజ్ కాము. గోదావరి నికర జలాలు.. వరద జలాలు మా హక్కు” అని అన్నారు. ‘పదేండ్లు తెలంగాణకు అన్యాయం చేసిందెవరో భవిష్యత్ తరాలకు తెలిసేలా శాసన సభలో చర్చ చేద్దాం రండి’ అని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సవాల్ విసిరారు.