జర్నలిస్టులను గత ప్రభుత్వం పట్టించుకోలేదు : చలసాని శ్రీనివాసరావు 

జర్నలిస్టులను గత ప్రభుత్వం పట్టించుకోలేదు : చలసాని శ్రీనివాసరావు 
  • టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీనివాసరావు 

సూర్యాపేట, వెలుగు: జర్నలిస్టులు పదేళ్ల నుంచి అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గతంలో ప్రభుత్వ పెద్దలను కలిసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ చలసాని శ్రీనివాసరావు అన్నారు.  శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడారు.

ఖమ్మంలో జూన్ 18,19,20 వ తేదీల్లో జరిగిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర మహాసభల్లో జర్నలిస్టుల సమస్యలపై సుదీర్ఘమైన చర్చ జరిగిందన్నారు. రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,  వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి జర్నలిస్టుల సమస్యలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి  తీసుకెళ్లారని చెప్పారు. జర్నలిస్టులకు మంచి రోజులు వచ్చాయని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని జర్నలిస్టులకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం  ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు.