కేసీఆర్ వల్లే పాలమూరు ఆగమైంది : చల్లా వంశీచంద్​రెడ్డి

 కేసీఆర్ వల్లే పాలమూరు ఆగమైంది : చల్లా వంశీచంద్​రెడ్డి


బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ వల్లనే పాలమూరు ఆగమైందని  సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్​రెడ్డి ఆరోపించారు.  కేసీఆర్ హయాంలో పాలమూరుకు ఒక్క చుక్కరలేదని విమర్శించారు.  ఈ మేరకు పాలమూరు ప్రజల తరుపున కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.  పాలమూరుకు కల్వకుర్తి, నెట్టంపాడు,  జూరాల, డిండి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు వస్తు్న్నాయని చెప్పారు . కృష్ణ బేసిన్ నీళ్ళు తమకు రావాల్సింది పెన్నా బేసిన్ ద్వారా ఆంధ్రవాళ్లు నీళ్లు తరించుకుపోతున్నారని లేఖలో ఆరోపించారు. 

నీళ్లు,  నిధులు, నియమాకాలతో రాష్ట్రాన్ని సాధిస్తే ..  కేసీఆర్ కుటుంబ పాలన చేశారని విమర్శించారు.  పాలమూరు ఓట్లతో రాజకీయ పునర్జన్మ పొందిన కేసీఆర్... నీళ్లు ఆంధ్రా వాళ్లకు, నియామకాలు ఆయనకుటుంబానికి,  నిధులు ఆంధ్రా కాంట్రక్టర్ లకు అప్పగించి లక్షల కోట్లు కమిషన్ తీసుకున్నారని ఆరోపణలు గుప్పించారు. తప్పు చేయలేదని చెప్పే దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ మహాబూబ్ నగర్ నుంచి పోటీ చేయాలని వంశీచంద్ రెడ్డి డిమాండ్ చేశారు.   

కేసీఆర్ పదేళ్ల పాటు దుర్మార్గపు పాలన కొనసాగించారని, తెలంగాణ ప్రజలను మోసం చేసి కల్వకుంట్ల కుటుంబం బాగుపడిందని  వంశీచంద్​రెడ్డి లేఖలో తెలిపారు.  రేవంత్ ప్రజా పాలన చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదన్నారు.  అబద్దపు మాటలు చెబుతూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.