పాలమూరు పేరుతో కేసీఆర్​ నిధులు మేసిండు : చల్లా వంశీచంద్​రెడ్డి

పాలమూరు పేరుతో  కేసీఆర్​ నిధులు మేసిండు : చల్లా వంశీచంద్​రెడ్డి

కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే. పాలమూరు 80 శాతం పూర్తయ్యిందంటే అర్థం 80 శాతం నిధులు బుక్కారని. 80 శాతం పనులు మాత్రం ఎక్కడా కాలేదు. ఈ ప్రాజెక్టు పేరుతో 80 శాతం నిధులు డ్రా చేసుకున్నరు. ఉద్దండాపూర్, కరివెన ప్రాజెక్టులు 30 శాతం కూడా పూర్తికాలే. లక్ష్మీదేవిపల్లికి ల్యాండ్ అక్విజేషన్​ కూడా పూర్తి చేయలే. అలాంటప్పుడు 80 శాతం పనులు ఎట్లయితై? జలయజ్ఞం కింద 2004లో అప్పటి సీఎం వైఎస్సార్ ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి కోయిల్​సాగర్, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి స్కీములను తెచ్చిండు. 

2014 నాటికి ఇవి దాదాపు పూర్తయ్యాయి. మిగిలిన పనులు చేయడానికి కేసీఆర్​కు మనసు రాలేదు. కాంగ్రెస్​కు పేరొస్తుందని ఈ స్కీములను పట్టించుకోలేదు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుస్తుందని తెలిసి ప్రజలను మాయ చేసేందుకు 'పాలమూరు' స్కీమ్​కు డ్రై రన్​ చేసిండు. ఉమ్మడి జిల్లాకు వస్తున్న సాగునీరంతా కాంగ్రెస్​ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులతోనే వస్తున్నయ్​.