త్వరలో ఏపీలో భారీ వర్షాలకు ఛాన్స్!

త్వరలో ఏపీలో భారీ వర్షాలకు ఛాన్స్!

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అతలాకుతలమైంది. కాగా.. మరోసారి దక్షిణాంధ్రను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం మరియు పరిసర ప్రాంతాలలో తక్కువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో  సర్క్యులేషన్ ఉంది.  ఇవి రాబోయే నాలుగైదు రోజులలో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ నెల 26 నుంచి డిసెంబర్ 2 వరకు.. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప మరియు అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం సూచించింది.