లాన్ బౌల్స్లో భారత్కు సిల్వర్ లేదా గోల్డ్ వచ్చే ఛాన్స్

లాన్ బౌల్స్లో భారత్కు సిల్వర్ లేదా గోల్డ్ వచ్చే ఛాన్స్

కామన్వెల్త్ గేమ్స్లో  మరో పతకం భారత్ ఖాతాలో చేరబోతుంది. ఇప్పటి వరకు వెయిట్ లిఫ్టింగ్లోనే  6 మెడళ్లు వచ్చాయి. అయితే లాన్ బౌల్స్లో భారత్కు సిల్వర్ లేదా గోల్డ్ మెడల్ వచ్చే అవకాశం ఉంది. ఉమెన్స్  ఫోర్స్ లాన్ బౌల్స్ టీమ్  సెమీస్లో  న్యూజిలాండ్‌పై 16-13 స్కోరు తేడాతో  గెలిచింది. దీంతో లాన్ బౌల్స్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు లాన్ బౌల్స్  స్పోర్ట్స్లో భారత్కు దక్కలేదు. ప్రస్తుతం ఫస్ట్ టైం ఇండియా లాన్ బౌల్స్ లో మెడల్ సాధించబోతుంది. మహిళల ఫోర్స్ లాన్స్ బౌల్స్ జట్టులో లవ్లీ చౌబే ఆధిక్యం ప్రదర్శించగా, పింకీ రెండో స్థానంలో, నయన్మోని సైకియా తృతీయ స్థానంలో, రూపా రాణి టిర్కీ స్కిప్‌ పొజిషన్లతో అదరగొట్టారు. ఈ నలుగురి ప్రదర్శనతో ఫైనల్లో గెలిస్తే  భారత ఖాతాలో స్వర్ణం చేరుతుంది. ఒక వేళ ఓడితే సిల్వర్ పతకం అయినా దక్కుతుంది.