కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు తక్కువే

V6 Velugu Posted on Sep 13, 2021

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించింది. ముఖ్యంగా సెకండ్ వేవ్‌లో భారత్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే త్వరలో థర్డ్ వేవ్ ఉంటుందనే ఆందోళన అందరిలోనూ ఉంది. అయితే.. మూడో వేవ్ అవకాశాలు చాలా తక్కువేనని ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మాజీ సైంటిస్ట్ డాక్టర్ రమణ్ గంగాఖేడ్కర్ తెలిపారు. అయితే పిల్లల్ని ఇప్పుడే స్కూళ్లకు పంపొద్దని సూచించారు.

ఒకవేళ భారతో లో థర్డ్ వేవ్ వచ్చినా కూడా ఇంతకుముందులా అంత ప్రభావం ఉండకపోవచ్చన్నారు గంగాఖేడ్కర్. ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లు తెరవకపోవడమే మంచిదని తెలిపారు. తప్పని పరిస్థితుల్లో ఓపెన్ చేస్తే మాత్రం ఎక్కువమంది ఉండకుండా రోజుమార్చి రోజు విధానాలు పాటిస్తే మంచిదని సూచించారు. అంతేకాదు.. వ్యాక్సిన్ తో కరోనా నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉందని వివరించారు. చిన్నారులకు కరోనా సోకినా.. వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం కారణంగా పెద్దగా ప్రమాదం ఉండదని చెప్పారు. అయినా రిస్క్ తీసుకోవడం మంచిది కాదని.. ప్రజలందరూ అలర్ట్ గా ఉండటంతో పాటు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు.

Tagged Third wave, corona virus coming, chances very low, Former ICMR scientist, Dr Raman Gangakhedkar 

Latest Videos

Subscribe Now

More News