అనన్య పాండే, ‘కిల్’ ఫేమ్ లక్ష్య్ జంటగా రూపొందుతున్న మ్యూజికల్ లవ్ స్టోరీ ‘చాంద్ మేరా దిల్’. వివేక్ సోనీ దర్శకత్వం వహిస్తుండగా కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే టీజర్‌తో అంచనాలు పెంచిన మేకర్స్ సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు.
కాంప్లికేటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న కపుల్‌గా అనన్య, లక్ష్య్ కనిపించారు. చాందినీ... తప్పయింది సారీ అంటూ తనకు ఏదో నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఆరవ్. కానీ ఆమె తన సారీని యాక్సెప్ట్ చేయడం లేదు. కట్ చేస్తే ప్లాష్ బ్యాక్. అతనో రెగ్యులర్ గయ్.. అందుకే అతన్ని లవ్ చేశానంటోంది. .
ఒకరిని వదలి మరొకరు బ్రతకలేనంత డీప్ లవ్‌లో మునిగిపోయారు. కానీ ఇంతలో బ్రేకప్. అందుకు దారితీసిన పరిస్థితులేంటి, అతని ప్రేమను అంగీకరించిందా, లేదా అన్నది మెయిన్ కాన్సెప్ట్. అవధులు లేని ప్రేమ, అవరోధంగా మారిన గొడవలు, భావోద్వేగాలను ట్రైలర్‌లో ప్రజెంట్ చేసిన తీరు బాగుంది.
చరిత్రలోని గొప్ప ప్రేమకథలు అన్నీ విషాదాంతాలు, ప్రేమకంటే ఆత్మాభిమానం ఇంకా గొప్పది లాంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ నేపథ్యంలో వస్తున్న ఈ ఇంటెన్స్ లవ్ స్టోరీ మే 22న ప్రేక్షకుల ముందుకురానుంది.
