చందానగర్, వెలుగు: జర్నలిస్టుల సొంతింటి కల త్వరలోనే సాకారం అవుతుందని టీయూడబ్ల్యూజే నాయకులు తెలిపారు. చందానగర్ పీజేఆర్ స్టేడియంలో సోమవారం శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి పైళ్ల విట్టల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, ఉపాధ్యక్షుడు గంట్ల రాజిరెడ్డి, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి రమేశ్సగర హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ కృషితో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సహకారంతో చందానగర్ లో శేరిలింగంపల్లి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం గత ప్రభుత్వం ఎకరా స్థలాన్ని కేటాయించిందని గుర్తు చేశారు. ఆ స్థలంలో ఇళ్ల నిర్మాణాల కోసం యూనియన్ ఆధ్వర్యంలో కృషి చేస్తామని చెప్పారు.
