యూపీలో రైలు ప్రమాదం.. 12 బోగీలు పల్టీలు కొట్టాయి

యూపీలో రైలు ప్రమాదం.. 12 బోగీలు పల్టీలు కొట్టాయి

ఉత్తర ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జూలై 18 మధ్యాహ్నం 2.35 గంటలకు  చండీగఢ్- డిబ్రూగఢ్ రైలు గోండా- మన్కాపూర్  దగ్గర  పట్టాలు తప్పింది. ఝులాహి రైల్వే స్టేషన్‌కు కొన్ని కిలోమీటర్ల ముందు ఏసీ కంపార్ట్‌మెంట్‌లోని 4  కోచ్‌లు పట్టాలు తప్పాయి.  మరో  12 బోగీలు పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు మృతి చెందగా.. పలువురికి గాయలు అయ్యాయి.  ఘటనా స్థలానికి వచ్చిన రెస్క్యూ టీం సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.  గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. 

 ఈ రైలు ప్రమాదంపై  యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్  ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.  సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.