గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్లు: చంద్రబాబు

గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్లు: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటన కొనసాగుతోంది.2024 ఎన్నికలు టీడీపీకి లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారాయి.   ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో ఆయన భేటీ అయ్యారు... గెలిచే అవకాశం ఉన్నవారికే టికెట్లు ఇస్తామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు టీడీపీ (TDP) అవసరం ఎంతో ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు(ChandraBabu) అన్నారు. 2024 ఎన్నికల్లో గెలిచేందుకు... ఆ వ్యూహానికి తగ్గట్టు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేస్తున్నారాయన. పార్టీ టికెట్ల వ్యవహారంపై కూడా మందుగానే హింట్ ఇచ్చేశారు. 

గెలుపు గుర్రాలకే టికెట్లు..

ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో సమావేశమైన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు.గెలిచే అవకాశం ఉన్న వారికే ఈసారి టికెట్లు ఇస్తానన్నారు. నాయకుల పనితీరు బాగాలేకపోతే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పనితీరు బాగాలేకపోతే.. వారికి ప్రత్యామ్నాయం చూపించి పక్కన పెడతానని కుండబద్దలు కొట్టారు. గతంలో మొహమాటాలకోసం, సీనియర్లకు ప్రయారిటీ ఇవ్వడం కోసం, సీనియర్ల వారసుల కోసం కొన్ని టికెట్లు కేటాయించేవారు. కొన్నిచోట్ల గెలవరు అని తెలిసినా కూడా మొహమాటం కోసం పార్టీ బీఫామ్ ఇవ్వాల్సి వచ్చిందని . ఇకపై అలాంటి వాటికి చెక్ పెడతానన్నారు చంద్రబాబు

ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని చెప్పారు చంద్రబాబు. ఇక ఓట్ల అవకతవకల విషయంపై కూడా అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. దొంగఓట్లు, ఓట్ల తొలగింపు విషయంలో ఇన్‌ ఛార్జ్‌ లు బాధ్యతలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో అన్నీ పార్టీ అధిష్టానం చూసుకుంటుందనే అలసత్వం వద్దని నాయకులకు హితవు పలికారు.