సుప్రీంకోర్టులో మూడు బెంచులు మారిన చంద్రబాబు పిటిషన్ : చివరకు వాయిదా

సుప్రీంకోర్టులో మూడు బెంచులు మారిన చంద్రబాబు పిటిషన్ : చివరకు వాయిదా

సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లు ఉత్కంఠ రేపాయి. మొదటగా ద్విసభ్య ధర్మాసనానికి వెళ్లగా.. నాట్ బిఫోర్ మీ అంటూ న్యాయమూర్తి భట్టి ప్రకటించారు. దీంతో లాయర్లు ఏదో ఒక నిర్ణయం చెప్పాలని వాదించటంతో.. మరో న్యాయమూర్తి కన్నా వచ్చే వారానికి వాయిదా వేశారు. 

చంద్రబాబు క్వాష్ పిటిషన్లు వచ్చే వారానికి వాయిదా పడటంతో షాక్ అయిన లాయర్లు.. అత్యవసరంగా విచారించాలంటూ ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ దగ్గరకు వెళ్లారు. ద్విసభ్య ధర్మాసనం నిర్ణయాన్ని చీఫ్ జస్టిస్ దగ్గర సవాల్ చేశారు. దీంతో ఆయన పిటీషన్ ను పరిగణలోకి తీసుకుంటూ.. చంద్రబాబు తరపు లాయర్ల వాదనలు విన్నారు. క్వాష్ పిటీషన్ కొట్టివేయాలని.. చంద్రబాబుపై నమోదైన కేసులను కొట్టివేయాలని వాదించారు. 

Also Read :- చంద్రబాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. విచారణ వారం వాయిదా

చంద్రబాబు తరపు లాయర్ల వాదనలు విన్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ .. కేసును మరో బెంచ్ కు బదిలీ చేస్తున్నానని.. అక్టోబర్ 3వ తేదీన ఆ బెంచ్ వాదనలు వింటుందని తీర్పు ఇచ్చారు. దీంతో చంద్రబాబు కేసు వాయిదా పడినట్లు అయ్యింది. 

సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై నిర్ణయం వస్తుందని ఆశించిన టీడీపీ షాక్ అయ్యింది. అక్టోబర్ 3వ తేదీ అంటే.. మరో వారం రోజులు.. అప్పటి వరకు ఎలాంటి నిర్ణయం ఉండదు.. ఎందుకంటే అక్టోబర్ 2వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు సెలవులు. ఇక అక్టోబర్ 3వ తేదీ నిర్ణయం ఎలా ఉంటుంది అనేది వేచి చూడాల్సిందే..