చంద్రబాబు హెల్త్ బులెటిన్ విడుదల... 8 రకాల వైద్య పరీక్షలు

చంద్రబాబు హెల్త్ బులెటిన్ విడుదల... 8 రకాల వైద్య పరీక్షలు

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్ (Health bulletin) విడుదల చేసినట్లు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు వెల్లడించారు. చంద్రబాబుకు డాక్టర్ల బృందం 8 రకాల వైద్య పరీక్షలు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. వైద్య అధికారుల బృందం ఇచ్చిన వైద్య నివేదిక ప్రకారం ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జైలు అధికారులు పేర్కొన్నారు. 

రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు   వైద్య పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబుకు 8 రకాల వైద్య పరీక్షలు జరిపారు. ఈ వివరాలతో కూడిన చంద్రబాబు హెల్త్ బులెటిన్ ను జైలు అధికారులు  విడుదల చేశారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. 

చంద్రబాబు బీపీ సాధారణంగానే ఉండగా, ఫిజికల్ యాక్టివిటీ బాగున్నట్లు రాజమండ్రి జైలు అధికారులు తెలిపారు. నిమిషానికి 12 సార్లు శ్వాస తీసుకుంటుడగా, నిమిషానికి 67 సార్లు గుండె కొట్టుకుంటున్నట్లు హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. ఊపిరితిత్తులకు సంబంధించి క్లియర్ గానే ఉన్నాయని చంద్రబాబు యాక్టివ్ గానే ఉన్నారని డాక్టర్ల టీమ్ జైలు అధికారులకు వివరించారు.

చంద్రబాబు హెల్త్ బులెటిన్ వివరాలు....

  • 1. రక్తపోటు- 130/80
  • 2. శరీర ఉష్ణోగ్రత- సాధారణం
  • 3. నాడి  67 ( నిమిషానికి )
  • 4. ఆక్సిజన్ శాచ్యురేషన్  97 శాతం
  • 5. శ్వాసకోశ వ్యవస్థ పనితీరు 12 నిమిషానికి
  • 6. హృదయ స్పందన  ఎస్1+ , ఎస్2+
  • 7. ఊపిరిత్తులు   క్లియర్ 
  • 8. శారీరక క్రియాశీలత   బాగుంది